![]() |
![]() |

కార్తీ లేటెస్ట్ ఫిల్మ్ 'సర్దార్', దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 న విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ఆసక్తికరమైన ట్రైలర్‌తో ఈ మూవీ ఇప్పటికే చాలా మంచి బజ్‌ను సృష్టించింది. హీరో కార్తీ పలు గెటప్పులతో ఆకట్టుకున్నాడు, అదే సమయంలో సినిమాపై కుతూహలాన్ని పెంచేశాడు. బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు అతను తహతహ లాడుతున్నాడు. అయితే, అనూహ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న 'జవాన్' స్టోరీ, 'సర్దార్' స్టోరీ ఒకటే అని ఒక సో-కాల్డ్ ట్రేడ్ విశ్లేషకుడు రాయడంతో ఒక అనవసరమైన వివాదం తలెత్తింది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న 'జవాన్' మూవీని అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు.
తమిళ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ట్రేడ్ వెబ్‌సైట్, FabFlickzకి కీలక కంట్రిబ్యూటర్‌ని అని చెప్పుకునే క్రిస్టఫర్ కనగరాజ్ తన ట్వీట్‌లలో ఒకదానిలో, “కార్తీ #Sardar & అట్లీ #Jawan రెండూ ఒకటే. రెండింటిదీ ఒకే కథ." అని రాశాడు.
మరో ట్వీట్‌లో, అతనే “నాన్న - రా ఏజెంట్ కొడుకు - పోలీస్ ఏజెంట్ నాన్న ఒక మిషన్‌లో ఉన్నప్పుడు (విలన్ పాత్ర కారణంగా) వేరే ప్రదేశంలో/దేశంలో చిక్కుకొనిపోతాడు. కొన్నాళ్ల తర్వాత అతను విలన్‌పై పగ తీర్చుకోవడానికి వస్తాడు. అక్కడ తన కొడుకుని కలుస్తాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్." అని రాశాడు.
అయితే, షారుఖ్ ఖాన్ 'జవాన్', కార్తీ 'సర్దార్'.. రెండింటికీ పనిచేసిన ఎడిటర్ రూబెన్, ఈ ట్వీట్‌లను గమనించి, క్రిస్టఫర్ విచిత్రమైన, పూర్తిగా ధృవీకరించబడని వాదనలపై క్లాస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. క్రిస్టఫర్ చేసిన ట్వీట్‌ను మెన్షన్ చేస్తూ, "స్కూలు రోజుల్లోకి వెళ్తే, నాతో సహా చాలా మంది తలైవర్ రజనీకాంత్, కెప్టెన్ విజయకాంత్ బ్రదర్స్ అని అనుకొనేవాళ్లం, 'కాంత్' అనే ఫ్యాక్టర్ వల్ల. ఆ తర్వాత నేను ఎదిగాను. కొంతమంది మాత్రం బాల్యం దగ్గరే ఆగిపోయారు. And inga RAW agent vechitu,#Ishtathukku RAW va adichu vidakoodaadhu" అని రాశాడు. ఇంకో ట్వీట్‌లో "ఈ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకొన్న వాళ్లందరినీ రిలీజ్ తర్వాత రెండు కథల్నీ పోల్చి చూడమని కోరుతున్నాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్" అని చెప్పాడు.
![]() |
![]() |